బిగ్ బాస్ సెట్లో ప్లంబర్ మృతి

కలకలం రేపిన తమిళ బిగ్ బాస్ హౌస్ మేట్ ఓవియా ఆత్మహత్యాయత్నం ఘటన మరువకముందే బిగ్ బాస్ సెట్లో మరో విషాదం నెలకొంది. సెట్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇప్పుడు షో నిర్వాహకులను కలవరపెడుతోంది. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన ఇబ్రహీం షేక్ (28) అనే వ్యక్తి తమిళ బిగ్ బాస్ సెట్లో ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే పనిచేస్తున్న ఇబ్రహీంకు ఫిట్స్ (సీజర్) వచ్చి కిందపడిపోయాడు. వెంటనే అతడికి ప్రథమ చికిత్స నిర్వహించి సమీపంలోని కిల్పాక్ మెడికల్ కాలేజీకి (కేఎంసీ)కి తరలించినా ఫలితం దక్కలేదు. అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. తన ఒంట్లో బాగాలేదని అంతకుముందే చెప్పినట్టు తోటి వర్కర్లు చెప్పారు. అతడికి విపరీతంగా చెమట పట్టేసిందని, వెంటనే ఫిట్స్ వచ్చి పడిపోయాడని వెల్లడించారు. ఘటనపై నజరత్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బిగ్ బాస్ సెట్లో ప్లంబర్ మృతి

----

Photo Albums

READ MORE

Latest News

READ MORE

POLITICAL NEWS

READ MORE