భారతీయ స్త్రీలను కించపరిచేలా వీడియో

సోషల్ మీడియావల్ల ఎంతో ప్రయోజనం పొందుతూ అన్నిరకాలుగా ఆనందించేవారు సక్రమంగా వినియోగించుకునేవారు కొందరైతే... కోతికి కొబ్బరికాయ దొరికినట్లు వాడేవారు ఇంకొందరు. ఇలా సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెన్సేషన్ కోసమో పాపులారిటీ కోసమో కానీ కొన్ని పనికిమాలిన పనులకు పూనుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు. ఈ సమయంలో వివాదాస్పద ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడం వివాదాస్పద కామెంట్లు చేయడం చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని వివాదస్పద వీడియోలనూ చిత్రీకరించి వాటిని ఆన్ లైన్ లో వదలడం కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో "పెన్ పైనాపిల్.. యాపిల్ పెన్" అనే ఒక వీడియో దర్శనమిచ్చింది. ఈ వీడియో భారతీయ మహిళలను కించపరిచేలా ఉందని కామెంట్స్ వినిపించాయి!!

ప్రపంచాన్నంతా ఓ ఊపు ఊపిన గంగ్నమ్ స్టైల్ కు పేరడీగా వచ్చిన ఈ పాటతో చేసిన ఒక వీడియో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు. దీంతో జనాలంతా ఈ వీడియోను చూడడానికి ఎగబడ్డారు. ఫలితంగా అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది వీక్షించిన పాటగా గిన్నీస్ బుక్ రికార్డుల్లోను చోటు సంపాదించుకుంది. దాని రికార్డుల సంగతి పక్కనపెడితే... ఈ వీడియోలో భారతీయ స్త్రీలను కించపరిచేలా ఇందులోని మహిళ వస్త్రధారణ ఉందనేది ఈ వీడియోపై నెలకొన్న వివాదం. దీంతో చాలామంది ఇండియన్ నెటిజెన్స్ ఈ వీడియోపై ఫైరయ్యారు. ఈ వీడియోలో కామెంట్స్ తో రచ్చ రచ్చ చేయడంతో... వీడియోను రూపొందించిన వ్యక్తి క్షమాపణలు చెప్పాడు.. మరోసారి ఇలా చేయనని విన్నవించాడు!

భారతీయ స్త్రీలను కించపరిచేలా వీడియో

---