గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది

సబ్సిడీ వంట గ్యాస్‌ సిలిండర్ ధర పెరిగింది. ఒక్కో సిలిండర్ పై రెండు రూపాయల 7పైసలు పెంచాయి చమురు కంపెనీలు. LPG సిలిండర్ ధర పెరగడం.. ఆరు నెలల్లో ఇది ఏడోసారి. గ్యాస్ ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది కేంద్రం. పెరిగిన ధరతో సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.432.71 అయ్యింది. పెంచక ముందు సిలిండర్ ధర రూ. 430.70 ఉంది. సబ్సిడీ గ్యాస్ ధర ఆరు నెలల్లో ఏడు పెరగటం వినియోదారులపై భారం పడుతుంది. మరోవైపు విమాన ఇంధనం ధరను మాత్రం 3.7 శాతం తగ్గించింది.

గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది

---