PM Modi Full Speech At BJP Parivartan Rally In Moradabad

ప్ర‌జ‌లే త‌న‌కు హైక‌మాండ్ అన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని మొరాదాబాద్‌లో జ‌రిగిన బీజేపీ ప‌రివ‌ర్త‌న్ ర్యాలీలో ఆయ‌న ప్ర‌సంగించారు. దేశంలో పేద‌రికం నిర్మూలించ‌డ‌మే త‌న ప్ర‌భుత్వం ప్ర‌థ‌మ‌ క‌ర్త‌వ్య‌మ‌ని ప్ర‌ధాని అన్నారు. బ‌డాబాబులు న‌ల్ల‌ధ‌నంతో దేశాన్ని దోచుకున్నార‌ని మండిప‌డ్డ మోడీ.. ఇక‌పై వారికి చెడ్డ‌రోజులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని హెచ్చ‌రించారు. ఏనాడు బ్యాంకుల ముఖం చూడ‌ని కొంద‌రు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో బ్యాంకుల‌కు వెళుతున్నార‌ని చెప్పారు. కొంద‌రు జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో దొంగ డ‌బ్బును జ‌మ‌ చేస్తున్నార‌ని వారి భ‌ర‌తం కూడా ప‌డ‌తామ‌ని ప్ర‌ధాని అన్నారు. దేశంలో రోజులు మారాయ‌ని చెప్పిన ప్ర‌ధాని..ఒకప్పుడు పేద‌వాడు ధ‌న‌వంతుల చుట్టూ తిరిగేవాడ‌ని …ఇప్పుడు ధ‌న‌వంతుడే పేద‌వాడి చుట్టూ తిరుగుతున్నాడ‌ని అన్నారు. మీ జన్ ధన్ అకౌంట్లలో పడిన నల్ల డబ్బు మీదే అని.. ఎవరైనా డబ్బులు అడిగితే మోడీకి లెటర్ రాస్తానని బెదిరించాలని యూపీ పరివర్తన్ ర్యాలీలో మోడీ జనానికి పిలుపునిచ్చారు.

న‌ల్ల‌ధ‌నంపై యుద్ధం ప్ర‌క‌టించ‌డం పాపం చేసిన‌ట్ల‌వుతుందా అని మోడీ ప్ర‌శ్నించారు. మొన్న‌టి వ‌ర‌కు మ‌నీ మ‌నీ అన్న‌వారు ఇప్పుడు మోడీ..మోడీ అంటూ మంత్రం జ‌పిస్తున్నార‌న్నారు. అవినీతి దేశాన్ని నాశ‌నం చేసింద‌ని పేర్కొన్న ప్ర‌ధాని త‌ర్వ‌లో బీజేపీ ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌జ‌ల త‌ల‌రాత‌ను మారుస్తుంద‌ని వెల్ల‌డించారు. మీ మొబైల్ ఫోన్‌లోనే మీకు బ్యాంకు ఉంటుంద‌ని చెప్పారు ప్ర‌ధాని . వాట్స‌ప్‌లో ఓ వీడియో చూసిన‌ట్లు మోడీ చెప్పారు. కారులో ఉన్న ఓ పెద్దాయ‌న వ‌ద్ద‌కు భిక్షాట‌న చేస్తూ ఓ యాచ‌కుడు వెళ్లాడట‌. చిల్ల‌ర లేద‌ని చెప్ప‌డంతో వెంట‌నే ఆ యాచ‌కుడు త‌న వ‌ద్ద ఉన్న స్వైపింగ్ మెషీన్ తీసి డెబిట్ కార్డును స్వైప్ చేయాల‌ని కోరాడని స‌భ‌లో ప్ర‌ధాని చెప్పిన‌ప్పుడు ప్ర‌జ‌ల నుంచి క‌ర‌తాళ‌ధ్వ‌నులు వినిపించాయి. 70 ఏళ్ల నుంచి దేశంలో మూలుగుతున్న న‌ల్ల‌ధ‌నాన్ని వెలికితీసేందుకు త‌న‌తో క‌లిసి రావాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు ప్ర‌ధాని మోడీ.

PM Modi Full Speech At BJP Parivartan Rally In Moradabad : Watch and Download PM Modi Full Speech At BJP Parivartan Rally In Moradabad | Free PM Modi Full Speech At BJP Parivartan Rally In Moradabad | latest PM Modi Full Speech At BJP Parivartan Rally In Moradabad.

PM Modi Full Speech At BJP Parivartan Rally In Moradabad

pm-modi-full-speech-at-bjp-parivartan-rally-in-moradabad